CHANDRA BABU COMMENT ON TRUMP | LATEST NEWS IN ANDRAPRADESH ~ AP OVERVIEW

AndraPradhesh Overview

Sunday 5 February 2017

CHANDRA BABU COMMENT ON TRUMP | LATEST NEWS IN ANDRAPRADESH


AP CM CHANDRABABU COMMENTS ON TRUMP


దేశాన్ని ఎలా నాశనం చేయాలో ఆయన చూపిస్తున్నారని వ్యాఖ్య
ఉపాధ్యాయులతో భేటీలో ఎన్నికల ప్రస్తావన చేసిన సీఎం

విజయవాడ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి దేశాన్ని ఎలా నాశనం చేస్తారనేది ట్రంప్‌ చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా మనవాళ్లు పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో ఉపాధ్యాయుల అధికారిక సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సదస్సులో సీఎం ఎన్నికల ప్రస్తావన చేయడం గమనార్హం. అంతేకాకుండా ఆయన పరోక్షంగా టీచర్ల ఓట్లను అభ్యర్థించారు. 'ఉపాధ్యాయులకు రెండు ఓట్లు ఉన్నాయి.. మీ సహకారం నాకు కావాలి' అని వ్యాఖ్యానించారు.

'2004లో నేను ఓడిపోతానని దేశంలో ఎవరూ ఊహించలేదు. మీలో చాలామంది నాకు వ్యతిరేకంగా పనిచేశారు. అందుకే ఈసారి అందరినీ కలుపుకొని వెళుతున్నా' అని చంద్రబాబు అన్నారు. అన్ని హైస్కూళ్లలో వైఫై ప్రవేశపెడతామని సీఎం చెప్పారు. పనుల కోసమే కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీని ఒప్పుకున్నానని, హోదాకు సమానంగా ప్యాకేజీ ద్వారా అన్ని ఇస్తామని కేంద్రం చెప్పిందని ఆయన చెప్పుకొచ్చారు.

0 comments:

Post a Comment